కేసీఆర్ జనం గురించి ఆలోచించడు : ఎంపీ చామల 

కేసీఆర్ జనం గురించి ఆలోచించడు : ఎంపీ చామల 
  • తన బాధలను జనం బాధలుగా భావించాలంటాడు: ఎంపీ చామల 

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్.. కవి కృష్ణ శాస్త్రి వంటి వారని, తన బాధలను జనం బాధలుగా ప్రచారం చేసుకుంటాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బుధవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్‌‌లో పడుకుంటూ.. ప్రజల గురించి ఆలోచించడం పూర్తిగా మానేశారని ఆరోపించారు. తనకు ఉన్న సమస్యలను జనానికి ఉన్నట్లు భావిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో ప్రతి పార్టీకి పదేండ్లు అధికారం ఇస్తున్నారని, ఈ లెక్కన రాష్ట్రంలో 2033 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, రేవంత్ రెడ్డియే సీఎంగా ఉంటారని చెప్పారు. కేటీఆర్ జనంలో ఉండకుండా కేవలం ట్విట్లర్లు, సోషల్ మీడియాకే పరిమితం అయిండని విమర్శించారు.