హైదరాబాద్, వెలుగు: భారత్–-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌పై కేంద్రం పునరాలోచన చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన విదేశీ మిత్రుల ప్రయోజనాల కోసమే ఈ ఒప్పందాలు చేసుకుంటున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు ఓపెన్ ట్రేడ్ మార్కెట్ ఇవ్వడం వల్ల దేశీయ రైతులకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే, దేశ ప్రజలకు నష్టం చేసే ఈ ట్రేడ్ డీల్‌ను కూడా రద్దు చేయాలన్నారు.
