న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ పై ఉందన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నదని విమర్శించారు.
