‘సంచార్ సాథీ’ యాప్‌తో వ్యక్తిగత భద్రతకు ముప్పు : ఎంపీ చామల

‘సంచార్ సాథీ’ యాప్‌తో వ్యక్తిగత భద్రతకు ముప్పు : ఎంపీ చామల
  • దీనిపై కేంద్రం పునరాలోచించాలి: ఎంపీ చామల

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘సంచార్ సాథీ’ యాప్‌తో వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాప్ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. 

పర్సనల్ సమాచారాన్ని ట్రాక్ చేయడానికి ఈ యాప్ ను వినియోగిస్తున్నారని ఆరోపించారు. సంచార్ సాథీ యాప్ పై కేంద్రం పునరాలోచించుకోవాలని కోరారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో యాప్ తప్పనిసరి కాదని గుర్తు చేశారు. అలాగే, ఎస్ఐఆర్​పై 9, 10 తేదీల్లో చర్చిస్తామని కేంద్రం చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు ఓ ప్రకటనలో చామల పేర్కొన్నారు.