మీపై ఒక్కసారి మీసం తిప్పితినే ఎంపీనయ్యా

మీపై ఒక్కసారి మీసం తిప్పితినే ఎంపీనయ్యా

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్ అయ్యారు. పోలీసులను రాజకీయ నాయకుల బూట్లు నాకమన్న జేసీ వ్యాఖ్యలను ఎంపీ మాధవ్ తప్పుబట్టారు. జేసీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. పోలీసు బూటును ఎంపీ మాధవ్
ముద్దాడారు.

ఎంపీ మాధవ్ మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఆ సందర్బంగా మాధవ్ మాట్లాడుతూ.. ‘పోలీసుల బూట్లు అంటే యుద్ధంలో ఆయుధాలు. ఆ బూట్లను మేం ముద్దాడుతాం. మా బూట్లు నాకమని చెప్పేందుకు జేసీకి మనసు ఎలా వచ్చింది? అహర్నిశలు చమటోడ్చి సమాజం కోసం పని చేస్తున్నది పోలీసులే. మీపై నేను ఒక్కసారి మీసం తిప్పితేనే ఎంపీ అయ్యాను.. ఆ దెబ్బకు మీరు బజారున పడ్డారు. గతంలో పోలీసులను తిట్టినందుకే పతనావస్థకు చేరావు. మీ పిల్లలకు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఒక పోలీసోడిగా నేను ట్రయల్ వేస్తే ఎంపీనయ్యా. పోలీసులు అనుకుంటే ఏదైనా చేయగలరు. జేసీ అంత నీచంగా మాట్లాడుతుంటే చంద్రబాబు దుర్యోదన చక్రవర్తిలా నవ్వుతున్నారు. చంద్రబాబుగారు మీకు మనసు లేదా? రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఇంత వయసు వచ్చింది కదా.. అలా మాట్లాడుతున్న జేసీని ఎందుకు ఆపలేదు’అని ఎంపీ మాధవ్ అన్నారు.

For More News..

లేడీ కండక్టర్‌పై యాసిడ్ దాడి