ప్రజల నమ్మకం వమ్ము చేయొద్దు : ఎంపీ మల్లు రవి

ప్రజల నమ్మకం వమ్ము చేయొద్దు : ఎంపీ మల్లు రవి
  • మున్సిపల్ కొత్త పాలకవర్గానికి ఎంపీ మల్లు రవి సూచన

షాద్ నగర్, వెలుగు: కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీ పాలకవర్గం పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని నాగర్​కర్నూల్ ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు. శుక్రవారం షాద్​నగర్​పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బస్వరాజ్, వైస్ చైర్మన్ అందే మోహన్,కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో విజయాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు.