రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ గందరగోళంగా ఉంది: ఆర్. కృష్ణయ్య

రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ గందరగోళంగా ఉంది: ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ గందరగోళంగా ఉందని..అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. సోమవారం హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్ లో ఎస్ఐ, కానిస్టేబుల్ సెలక్షన్ విధానంపై నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. పోలీస్ రిక్రూట్​మెంట్​ లో అవకతవకలు జరుగుతున్నాయని..అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

సెలక్షన్ ప్రాసెస్​లో ఎందుకింత గందరగోళం సృష్టిస్తున్నారని పోలీస్ ఆఫీసర్లను కృష్ణయ్య ప్రశ్నించారు. గతంలో లాంగ్ జంప్ 3.8 మీటర్లకు ఉంటే ఇప్పుడు 4 మీటర్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో లాంగ్ జంప్ 4 మీటర్లు దేనికని ఆయన నిలదీశారు. దీనివల్ల 50 శాతం మంది యువకులు కూడా క్వాలిఫై కావట్లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పోలీస్ ఉద్యోగాలు రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రన్నింగ్ లో 1600/800 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయినా అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని కోరారు.