బెల్టు షాపులు తెరిచి యువతను లిక్కర్‌కు బానిసలు చేస్తున్నరు

బెల్టు షాపులు తెరిచి యువతను లిక్కర్‌కు బానిసలు చేస్తున్నరు
  • రుణమాఫీ అతీగతీలేదు
  • రైతుబంధు డబ్బులు లోన్ వడ్డీ కింద జమైతున్నయ్​
  • సీజన్‌కో పంట వేయమనే కేసీఆర్.. నష్టమొస్తే ఆదుకోడు
  • రైతు భరోసా యాత్రలో రేవంత్ రెడ్డి విమర్శలు

నాగర్ కర్నూల్, వెలుగు: అగ్రి చట్టాల ముసుగులో వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు సెంటర్లను మింగేసే కుట్ర చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో ఆరో రోజైన శుక్రవారం రేవంత్ ఊర్కొండ ఆంజనేయస్వామి గుడిలో పూజల చేసి తర్వాత  జకినాలపల్లిలో రైతులతో మాట్లాడారు. తర్వాత ఇప్పపహడ్, కుప్పగండ్ల మీదుగా పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు సంతోషంగా లేడన్నారు. సీఎం ప్రతి సీజన్‌కు ఓ కొత్త పంట వేయమంటాడు. దిగుబడి రాక రైతులు నష్టపోతే కనీసం ఆదుకోడని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు పరిస్థితి దయనీయంగా మారిందంటూ శాంతిభద్రతలు, నేరస్తులను పట్టుకోవడానికి కంటే కూడా టీఆర్​ఎస్​ నేతలకు గులాంగిరి చేయడమే వారికి సరిపోతుందన్నారు. ఊరికి వంద బెల్టు షాపులు తెరిచి యువతను లిక్కర్ బానిసలుగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఊరికి పది కి.మీ.లోపున్న మార్కెట్ యార్డులలోనే రైతులకు కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) దొరకడం లేదని.. ఇక దేశంలో ఎక్కడికైనా పోయి అమ్ముకునే పరిస్థితి ఎక్కడుందని నిలదీశారు.

సీఎంకు బహిరంగ లెటర్​..

పాదయాత్రలో రైతులు తన వద్ద ప్రస్తావించిన అంశాలపై సీఎం కేసీఆర్​కు రేవంత్ రెడ్డి బహిరంగ లెటర్ రాశారు. రెండేండ్లైనా రుణమాఫీ అతీగతీ లేదని, రైతుబంధు డబ్బులను బ్యాంకులు పాత లోన్లు, వడ్డీల కిందికి జమ చేసుకుంటున్నాయన్నారు. కుంటి సాకులతో రెండో విడత రైతు బంధు డబ్బులు ఇవ్వట్లేదన్నారు. 2017లో రైతులకు అవసరమైన 26లక్షల యూరియా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఉచితం సంగతి దేవుడెరుగు ఇప్పుడు కొంటామన్నా రాష్ట్రంలో దొరికే పరిస్థితి లేదన్నారు. ఫామ్​హౌస్​లో కూర్చొని అంతా బాగుందని అనుకుంటే సరిపోదని రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For More News..

మేం తిట్టుడు స్టార్ట్​ చేస్తే ప్రధానిని కూడా వదలం

రోగాలపై స్పెషల్ ఫోకస్.. ఫైలెట్‌ ప్రాజెక్టు తెలంగాణలో సక్సెస్

జనరల్​ పబ్లిక్​కు వచ్చే నెలలో వ్యాక్సిన్