స్పీకర్ పదవిపై ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ పదవిపై ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

ముంబై: ఉద్దవ్ థాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవి జేడీయూ, టీడీపీలకు దక్కకపోతే.. ఆ పార్టీలను బీజేపీ చీల్చే ప్రమాదముందని హెచ్చరించారు. అందుకే ఎన్డీఏ పక్ష పార్టీలకు స్పీకర్ పదవి కీలకమని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ లోక్ సభ స్పీకర్ అభ్యర్థిని బరిలో నిలిపితే ఇండియా మద్ధతిస్తామని ప్రకటించారు సంజయ్ రౌత్. చంద్రబాబు డిమాండ్ కు బీజేపీ పెద్దలు ఒప్పుకోకపోతే.. తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆఫర్ చేశారు.