రాజ్యసభలో బీఆర్‌‌‌‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌‌‌గా వద్దిరాజు

రాజ్యసభలో బీఆర్‌‌‌‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌‌‌గా వద్దిరాజు

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభలో బీఆర్‌‌ఎస్‌‌ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. పార్టీ విప్‌‌గా ఎంపీ దీవకొండ దామోదర్‌‌రావుకు బాధ్యతలు అప్పగించారు. 

ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌‌కు ఆదివారం కేసీఆర్‌‌ లేఖ రాశారు. ఇటీవలే కేసీఆర్ రాజ్యసభలో ఫ్లోర్ లీడర్​గా సీనియర్ నేత కేఆర్ సురేశ్ రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పక్షనేతగా ఉన్న  కె.కేశవరావు స్థానంలో సురేశ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్ సభ సెక్రటరీ జనరల్​కు లేఖ రాశారు.