గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో కాంగ్రెస్ సీనియర్లీడర్, లయన్స్క్లబ్జోన్చైర్మన్ పి.మల్లికార్జున్ తల్లి జయశ్రీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం పరామర్శించారు. బుధవారం గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జయశ్రీకి మెరుగైన వైద్యం అందించాలని సింగరేణి డాక్టర్లకు సూచించారు.
అంతకుముందు ఎంపీని లయన్స్ క్లబ్ రీజియన్చైర్మన్ కె.రాజేందర్, కాంగ్రెస్ లీడర్లు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో లీడర్లు పాకాల గోవర్ధన్‌రెడ్డి, కామ విజయ్, అనుమాస శ్రీనివాస్, మల్లేశ్‌యాదవ్, తిప్పారపు మధు, జావెద్, దీపక్, నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
