గల్లీ నుంచి దేశవాళీ ప్లేయర్స్ తయారు కావాలన్నది మంత్రి వివేక్ డ్రీం: ఎంపీ వంశీకృష్ణ

గల్లీ నుంచి దేశవాళీ ప్లేయర్స్ తయారు కావాలన్నది మంత్రి వివేక్ డ్రీం: ఎంపీ వంశీకృష్ణ

కరీంనగర్ లో కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ ను పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ. శనివారం ( జనవరి 3 ) కరీంనగర్ జిల్లా అలుగునూరులోని వెలిచాల జగపతిరావు క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న వరంగల్, నల్గొండ మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్ ను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ఐపీఎల్ లా కాకా మెమోరియల్ టీ 20  టోర్నమెంట్ సాగుతోందని.. కరీంనగర్ లో ఇంత మంచి గ్రౌండ్ నిర్మించిన ఆగం రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. గల్లీ నుంచి దేశవాళీ ప్లేయర్స్ తయారు కావాలన్నది మంత్రి వివేక్ డ్రీం అని అన్నారు.

హెచ్సీఏ, మంత్రి వివేక్ ఇద్దరు  కలిసి కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ టీ20ని నిర్వహించడం ఆనందంగా ఉందని.. క్రికెట్ అంటే మంత్రి వివేక్ కి ఎంతో ఇష్టమనీ, గల్లి నుంచి దేశవాళీ క్రీడాకారులను తయారు చేయడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమన్నారు ఎంపీ వంశీకృష్ణ.ఇలాంటి టోర్నమెంట్ తో వివేక్ గారి డ్రీమ్ నెరవేరడమే కాకుండా, గ్రామీణ క్రీడాకారులు నేషనల్ స్థాయిలో ఆడేలా చేస్తుందని అన్నారు.

ఈ టోర్నమెంట్ లో ఇప్పటిదాకా దాదాపు 70 మ్యాచ్ లు జరగగా... ఇంకా 30కి పైగా మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఇవాళ మొదటి మ్యాచ్ లో వరంగల్, నల్లగొండ తలపడుతుండగా.. టాస్ గెలిచిన వరంగల్ బ్యాటింగ్ ఎంచుకుంది.