హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెంద డం.. నిందితుడైన ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేయకపో వడంపై పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నెల 16న ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతున్న భారతి ముఖి(26)ని ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్క డే ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి.
నిందితుడు ఎంపీ కుమారుడు కావడం వల్లే అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ మంజూరు చేశా రని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశాకు చెందిన భారతి ముఖి (26) మాదాపూర్‌లో ఉంటూ ఇనార్బిట్‌మాల్‌లోని ఓ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్నది. ఈ నెల 16న మధ్యాహ్నం తన స్నేహితురాలు పూజాతో కలిసి భోజనం కోసం ఐటీసీ కోహినూర్ వైపు వెళ్లింది. భోజనం తీసుకొని తిరిగి ఇనార్బిట్మాల్వైపు రోడ్డు దాటుతుండగా మాదాపూర్ వైపు నుంచి వేగంగా దూసుకు వచ్చిన కారు భారతిని ఢీకొట్టింది. ఆమె తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆ సమయంలో కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమ నేని రమేశ్ కుమారుడు సంజూష్ నడుపుతున్నాడు. రాష్ డ్రైవింగ్‌తో యువతి మృతికి కారణమైన సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, 5 రోజుల తర్వాత స్టేషన్ బెయిల్ మంజూరు చేసి నోటీసులు ఇచ్చారు.
డీసీపీ రితిరాజ్ వివరణ..
సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేసు బెయిలబుల్ కావడంతోనే నిందితుడు సంజూష్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశామని డీసీపీ రితిరాజ్ చెప్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజే నిందితుడు సంజూష్‌ను అదుపులోకి తీసుకొని, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని చెప్పారు. సంజూష్ అరెస్ట్ విషయంలో తమపై ఎవరి ఒత్తిళ్లూ లేవని, నిందితుడిపై బీఎన్ఎస్106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
