గండిపేట: ‘మిసెస్ యూనిటీ వరల్డ్’ విజేత ఆశా దీపికకు ఘన స్వాగతం

గండిపేట: ‘మిసెస్ యూనిటీ వరల్డ్’ విజేత ఆశా దీపికకు ఘన స్వాగతం

గండిపేట, వెలుగు: లక్నోలో 50 దేశాల పోటీదారులతో జరిగిన మిసెస్ యూనిటీ వరల్డ్–2026 టైటిల్​విజేతగా నిలిచిన ఆశా దీపిక గురువారం శంషాబాద్​రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. 

తెలంగాణలో పెరిగిన తాను ప్రస్తుతం అమెరికాలో ఏఐ టెక్నాలజీ రంగంలో, భారత ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే తన భవిష్యత్ లక్ష్యమని పేర్కొన్నారు.