
‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాల్ ఠాకూర్.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆయా మూవీ మేకర్స్ తనకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తోంది. ఒకరోజు ముందుగా ఈ మూవీ సెట్‌లో మృణాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్. ఇందులో ఆమె జూలియట్ పాత్రలో కనిపించబోతోందని తెలియజేస్తూ ఆ క్యారెక్టర్ పేరుతో కేక్ కట్ చేయించింది టీమ్. అలాగే బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పవర్‌ఫుల్ గెటప్‌లో గన్ పట్టుకుని ఇంటెన్స్‌గా కనిపించింది. ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. మరోవైపు మృణాల్ హిందీలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అలాగే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమాతో పాటు నాలుగు హిందీ సినిమాల్లో మృణాల్ నటిస్తోంది.