
చెన్నై : మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ లో ఓ యుగమని, దేశానికే నాయకుడు లాంటి వాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ పేర్కొన్నా డు. ఐపీఎల్ ఫైనల్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అతను ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘ ధోనీ కేవలం ఓ ఆటగాడు కాదు. క్రికెట్ లో ఓ యుగం వంటి వాడు. నిజానికి ఎంఎస్ ఓ గల్లీ జట్టు కెప్టెన్ లాంటోడు. అతను మనలో ఒక్కడు. ఏదైనా చేసి చూపించగలడు. అతను వామప్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. మహీ తన చుట్టూ ఉన్న ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బందిని పలకరిస్తూ బాగోగులు తెలుసుకుంటాడు. మంచి వాతావరణాన్ని సృష్టిస్తాడు. తనతో పాటు అందరిని ప్రశాంతంగా ఉండేలా చేస్తాడు. ధోనీ లాంటి కెప్టెన్ ఉంటే ఆటగాళ్లు ఎలాంటి చింత లేకుండాఆడతారు. సీఎస్కే అభిమా నులు అతన్ని ‘తలాధోనీ’ అని పిలుస్తుంటారు. తలా అంటే చెన్నైనాయకుడు అని వాళ్ల ఉద్దేశం. అయితే ధోనీ ఓ దేశానికే నాయకుడు అంతటి వాడు అనేది నా అభిప్రాయం’’ అని హేడెన్ అన్నాడు.