గెలుపును అలవాటుగా మార్చిన ధోనీ బర్త్ డే 

 గెలుపును అలవాటుగా మార్చిన ధోనీ బర్త్ డే 

టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ బుధవారంతో 40వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ధోనీని ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెప్పారు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హ్యాపీ బర్త్ డే స్కిప్పర్ (సారథి) అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

‘పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. నువ్వు నాకు మిత్రుడు, సోదరుడు, మెంటార్‌గా ఉన్నావ్. నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా. గొప్ప నాయకుడిగా, ఐకానిక్‌ ప్లేయర్‌గా స్ఫూర్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ మాజీ లెఫ్టాండర్ సురేష్ రైనా ప్రశంసించాడు. 

‘దాదా (సౌరవ్ గంగూలీ) యువకులుగా ఉన్న మాకు మ్యాచ్‌లు ఎలా గెలవాలో నేర్పించాడు. అదే ధోనీ దాన్నో అలవాటుగా మార్చేశాడు. ఇద్దరు అద్భుతమైన కెప్టెన్‌లు ఒక్క రోజు వ్యవధిలో జన్మించారు. భారత క్రికెట్‌ను మార్చేసిన వీరిద్దరికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని వెటరన్ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. 

‘నేనెప్పుడూ ప్రేమించే, నా గొప్ప స్నేహితుడైన మాహీ భాయ్‌కు హ్యాపీ బర్త్‌డే’ అంటూ డాషింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషెస్ చెప్పాడు.