
చెన్నై:3 చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై సహచరుడు ఇమ్రాన్ తాహిర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని ఆట తీరుఅద్భు తంగా ఉంటుందని, కూల్‌గా ఉంటూనే జట్టును ముందుండి నడిపిస్తాడని కొనియాడాడు. అతడో గ్రేట్ లీడరని, గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆని పేర్కొ న్నాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌లో మ్యాచ్ అనంతరం తాహిర్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచంలో కెల్లా బెస్ట్ ఫినిషర్ అనే నమ్మకానికి తగ్గట్లు ధోని సాగుతున్నాడని, అలాగే తనలో అద్భు త వ్యూహకర్త ఉన్నాడని తెలిపాడు. జట్టుకు అవసరమైన పరిస్థితుల్లో ధోని ఎన్నోసార్లు ఆదుకున్నాడని,అందుకే తనను అందరూ మిస్టర్ కూల్‌గా పిలుస్తారన్నాడు. గేమ్ ప్లాన్ కు అనుగుణంగా తను చాలా హార్డ్‌వర్క్ చేస్తాడని తెలిపాడు. ప్రాక్టీస్‌సెషన్లలో కూడా అతడు సహచరులకు హెల్ప్ చేస్తాడని, అలా చేయడాన్ని అందరూ గౌరవిస్తారని పేర్కొన్నాడు.
పిచ్ స్పిన్‌కు అనుకూలంగా లేదు..
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో తమకు పిచ్ నుంచి సహకారం లభించలేదని తాహిర్ పేర్కొ న్నాడు. నిజానికి టోర్నీ తొలిమ్యాచ్ లో స్పిన్‌కు విపరీతంగా అనుకూలించిన చిదంబరం స్టేడియంలో ఆదివారం మంచు కారణంగా బంతిపై పట్టు దొరకలేదని పేర్కొన్నాడు. అయినా తామంతా బాగా బౌలింగ్ చేశామని, బ్యాటింగ్ లో ధోని రాణించి తమకు అవకాశం కల్పించాడన్నారు. టీమ్‌గా తమ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నట్లు వ్యాఖ్యానిం-చాడు. ఆదివారం మ్యాచ్ లో మంచు ఇంతగా ఉంటుందని ఊహిం చలేదని, రాబోయే రోజుల్లో వెట్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తామని పేర్కొన్నాడు.మరోవైపు మంచును ఎదుర్కొ వడంలో తన అనుభవన్నంతా రంగరిస్తానని చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్ లో క్యాచ్ డ్రాప్ చేశానని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయబోనని తాహిర్ చెప్పుకొచ్చాడు.