
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ లో హెలికాప్టర్ షాట్లతో అభిమానులను అలరిస్తోన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆ షాట్ ను కనిపెట్టిన ఎంఎస్ ధోనీని కూడా ఫిదా చేశాడు. ‘ నీ హెలికాప్టర్ షాట్ బాగుంది’ అని ధోనీ తనతో అన్నాడని హార్దిక్ తెలిపాడు. కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రబాడ బౌలింగ్ లోను, చెన్నైతో మ్యాచ్ లో ధోనీ సమక్షంలో పాండ్యా హెలికాప్టర్ షాట్లు కొట్టాడు. ‘మ్యాచ్ లో హెలికాప్టర్ షాట్ కొడతానని కలలో కూడా అనుకో లేదు. కానీ కొద్ది రోజులుగా నెట్స్ లో ఆ షాట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ధోనీ గదికి వెళ్లి షాట్ ఎలా ఉందని అడిగా. షాట్ బాగుందన్నాడు’ అని హార్దిక్ చెప్పాడు.
ఆ బ్రేక్ హార్ది క్‌ను మార్చింది:
క్రునాల్ అనుకోకుండా కెరీర్ లో వచ్చిన బ్రేక్ వల్ల హార్దిక్ మరింత మెరుగైన క్రికెటర్ గా ఎదిగాడని అతని సోదరుడు క్రునాల్ పాండ్యా అన్నాడు. జట్టుకు దూరమైన ఆ టైమ్‌లో ఫిట్ నెస్, ఆటను మెరుగు చేసుకునేందుకు హార్దిక్ తీవ్రంగా శ్రమించాడన్నాడు.