
ఎంఎస్ ధోని ఎంతో కూలో అందరికీ తెలుసు. ప్రశాంతంగా ఉండే ధోని ఎప్పుడు కూడా మనం కోప్పడినట్లు కనిపించడు . అందుకే ధోనిని మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుస్తారు క్రికెట్ అభిమానులు. కానీ ఐపీఎల్ 12 సీజన్లో శనివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ధోనికి ఎందుకో కోపమొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పంజాబ్ విజయానికి లాస్ట్ 12 బంతుల్లో 39 పరుగులు కావాలి. అప్పుడు చెన్నై బౌలర్ దీపక్ చాహర్ వరుసగా రెండు నోబాల్స్ వేశాడు. దీంతో ప్రత్యర్థికి బ్యాక్ టూ బ్యాక్ ఫ్రీ హిట్స్ వచ్చాయి. దీంతో కాస్త సీరియస్ అయిన కెప్టెన్ ధోని.. చాహర్ దగ్గరకు వెళ్లి మందలించాడు. పరిస్థితిని వివరించి సలహా ఇచ్చాడు. దీనిపై చాహర్ కూడా అభ్యంతరం ఏం చెప్పలేదు. ధోని ఐడియాతో అదే ఓవర్లో క్రీజులో ఉన్న పంజాబ్ బ్యట్స్ మెన్ డెవిడ్ మిల్లర్ ను పెవిలియన్ కే చేర్చాడు చాహర్. ఈ మ్యాచ్ లో పంజాబ్ పై 22 రన్స్ తేడాతో విజయం సాధించించింది చెన్నై. పాయింట్ల టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ కు వెళ్లింది.