టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై.. తుది జట్టులో ధోనీకి నో ఛాన్స్

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై.. తుది జట్టులో ధోనీకి నో ఛాన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరగబోయే కీలక మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. టాస్ సమయంలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిమానులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చాడు. ఎంఎస్ ధోనీ జట్టుతోనే ఉన్నాడు, కానీ ఈ మ్యాచ్ ఆడేందుకు ఆయన ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని తెలిపాడు. అందుకే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు. 

రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం.. పిచ్ కాస్త పొడిగా ఉంది. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో వికెట్ బ్యాటింగ్‌కు అంత సులభంగా లేదు, అయినా మేము పక్కా ప్రణాళికలతోనే బరిలోకి దిగుతున్నాము. జట్టులో ఒక మార్పు చేసినట్లు పేర్కొన్నా డు. 

►ALSO READ | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్ ఎందుకు ఆడటం లేదు.. అసలు కారణం ఇదే..?

ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ఇది టీ20 క్రికెట్, ఇక్కడ ప్రతి మ్యాచ్ సులువుగా ఉండదు.. ప్రతి రోజూ ఒకే వ్యూహం వర్కవుట్ కాదని మాకు తెలుసు.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనే అనుకున్నాము.. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే ఈరోజు కూడా బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు. 


ఇరు జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్( వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్