గౌరవం రాదు.. మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి: మహేంద్ర సింగ్ ధోని

గౌరవం రాదు.. మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి: మహేంద్ర సింగ్ ధోని

క్రికెటర్ గా మెప్పించి అభిమానులని సంపాదించుకోవడం సహజం. అయితే కొంతమంది మాత్రం ఆటతో పాటు వ్యక్తిత్వంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటారు. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రధమ వరుసలో నిలుస్తాడు. తన మాటలతో, సింప్లిసిటీతో ఎంతోమంది ఫ్యాన్స్ మహేంద్రుడి సొంతం. తాజాగా ఒక కార్యక్రమంలో మిస్టర్ కూల్ జీవితం గురించి విలువైన సలహాలు ఇస్తున్నారు.   

ముంబైలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని..ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రనా వ్యక్తులకు గౌరవం రాదు. మన ప్రవర్తనతో దానిని సంపాదించుకోవాలి. మన పట్ల అవతల వ్యక్తులు చూపించే విధేయతతోనే గౌరవం వస్తుంది. అని ధోనీ అన్నారు. నమ్మకం కలగాలంటే ఒకరి మీద మన ప్రేమ చేతల్లో చేసి చూపించాలి. డ్రస్సింగ్ రూమ్ లో ఇతర ఆటగాళ్లకి, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే.. వారు విధేయతతో ఉండరు. అని ధోనీ చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం ధోనీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ ధోని ఎవరినైనా ఉద్దేశించి అన్నాడని కొంతమంది నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడికి సాయం చేసి రుణం తీర్చుకుని ఈ మిస్టర్ కూల్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మోకాలి సర్జరీ తర్వాత ఇటీవలే ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2023 ఐపీఎల్ సీజన్ ఆడిన ధోనీ..చెన్నై జట్టును విజేతగా నిలిపాడు. ఆ తర్వాత మోకాలి గాయంతో 2024 ఐపీఎల్ ఆడతాడో లేదో అనే అనుమానం అభిమానుల్లో కలిగినా ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.