
చెన్నై : మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే దాకా అతనే చెన్నై సూ పర్ కింగ్స్ కెప్టె న్ అని ఆ జట్టు ఆటగాడు సురేశ్ రైనా పేర్కొ న్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టును విజయవంతంగా నడిపిస్తున్న ధోనీ వయస్సు వచ్చే సీజన్ నాటికి 38కు చేరుతుంది. దీంతో అతని రిటైర్మెంట్ పై చర్చ జరుగుతోంది. ఈ సీజన్ లో రెండు మ్యాచ్‌ల్లో చెన్నైకు సారథ్యం వహించిన రైనా.. ధోనీ రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ కెప్టెన్ గా గుజరాత్ లయన్స్ జట్టు తో పాటు కొన్ని మ్యాచ్‌ల్లో ఇండియాను కూడా బాగా నడిపించా. ధోనీ జట్టు కెప్టెన్ కాకపోతే సమస్య కాదు. కానీ అతను జట్టులో లేకపోతే కీలక బ్యాట్స్ మన్ ను కోల్పోతాం . సన్ రైజర్స్ , ముం బై మ్యాచ్ ల్లో అది స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ గా, మెంటర్ గా చెన్నైజట్టును అతను అద్భుతంగా నడిపించాడు. ఇకచాలు అని ధోనీ ఒకవేళ తప్పుకుంటే వచ్చే సీజన్ లో నన్ను కెప్టెన్గా చూసే అవకాశం ఉంది. అయితే మహీతో పొలిస్తే నా సామర్థ్యం చాలా పెరగాలి’అని రైనా అన్నాడు.