ధోని బర్త్ డే వేడుకలు

ధోని బర్త్ డే వేడుకలు

ఎంఎస్ ధోని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం బ్రిటన్లో ఉన్న ధోని..వైఫ్ సాక్షితో పాటు..కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ధోని తన 41వ పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నాడు. బుధవారం రాత్రి సాక్షి, టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ సమక్షంలో ధోని కేక్ కట్ చేశాడు. ఈ బర్త్ డే వేడుకలకు సంబంధించిన వీడియోను ధోని వైఫ్ సాక్షి తన ఇస్టాలో పోస్ట్ చేసింది. 

అటు ధోనీకి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు, టీమిండియా ఆటగాళ్లు, ఫ్యాన్స్ ధోని విషెష్ చెబుతున్నారు. క్రికెటర్గా, కెప్టెన్గా ధోని రికార్డులు, పరుగులను గుర్తు చేసుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

41 అడుగుల కటౌట్..
ధోని 41వ బర్త్ డే సందర్భంగా ఏపీ  నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద  ఫ్యాన్స్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోనీ 41వ పుట్టిన రోజును సందర్భంగా ధోని 41 అడుగుల కటౌట్ ను పెట్టారు. 2011  వరల్డ్ కప్ లో విన్నింగ్ షాట్ కొడుతున్న స్టిల్ తో కటౌట్ రూపొందించారు.  ఈ కటౌట్ హైవే పక్కన ఏర్పాటు చేయడంతో..వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.