80సీట్లు, రెండేళ్లు పవర్ షేరింగ్ అడగాల్సింది - పవన్ కి ముద్రగడ లేఖ..!

80సీట్లు, రెండేళ్లు పవర్ షేరింగ్ అడగాల్సింది - పవన్ కి ముద్రగడ లేఖ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కాపు సంగం నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాసారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా తర్వాత నెలకొన్న పరిణామాలపై ఈ లేఖలో ఆయన స్పందించారు. జనసేన 24సీట్లకే పరిమితం కావటం బాధాకరం అన్న ఆయన 80సీట్లు, రెండేళ్లు సీఎం పదవి అడగాల్సిందని అన్నారు. పవన్ ఆ సాహసం చేయకపోవటం బాధాకరం అన్నారు. గతంలో జరిగిన అవమానాలు మరచి మీతో పని చేయాలని అనుకున్నానని, మన కలయిక జాతికి ఉపయోగపడుతుందని బావించానన్నారు ముద్రగడ.

ప్రజలు పవన్ కళ్యాణ్ ని ఉన్నతస్థానంలో చూడాలని అనుకుంటున్నారని అన్నారు. జనసేన పోటీ చేసే 24స్థానాల కోసం తన అవసరం రాదనీ, రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటున్నా అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తన పరపతి పెరగటానికి పవన్ కల్యాణే కారణం అని అన్నారు ముద్రగడ.తన కోసం వస్తానని చెప్పి పవన్ రాలేకపోయారని పవన్ కళ్యాణ్ కి గుర్తు చేశారు ముద్రగడ.

also read : ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్​ తోనే సాధ్యం: ఏపీ పీసీసీ చీఫ్​ షర్మిల
 

పవన్ కళ్యాణ్ రావటం తన చేతుల్లో ఉండదని ఎన్నో పర్మిషన్లు తీసుకోవాలని అన్నారు. టీడీపీ, జనసేన జెండా సభ సక్సెస్ అయ్యిందన్న ఆనందంలో ఉన్న పార్టీ శ్రేణులను ముద్రగడ లేఖ కలవరపెడుతోంది. జనసేన 24సీట్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో ఇప్పటికే పలుమార్లు వివరణ ఇచ్చిన పవన్ ముద్రగడ లేఖకు ఎలా స్పందిస్తారు, అసలు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.