
న్యూఢిల్లీ: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో దోహా (ఖతార్)లో భేటీ కానున్నారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. దోహాలోని లుసైల్ ప్యాలెస్‌లో ఖతార్ ఎమిర్ హోస్ట్ చేస్తున్న స్టేట్ డిన్నర్‌లో అంబానీ పాల్గొంటారని అన్నారు. ఈ ఏడాది ట్రంప్‌ను కలవడం అంబానీకి ఇది రెండోసారి. బిజినెస్ చర్చలు లేకపోవచ్చు. కానీ, అంబానీ బిజినెస్‌లు యూఎస్ నిర్ణయాలతో డైరెక్ట్‌గా ప్రభావితం అవుతున్నాయి. గత ఏడాది రిలయన్స్ వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్‌ను రీస్టార్ట్ చేయడానికి అమెరికా నుంచి అనుమతి పొందింది.
అయితే, ట్రంప్ వెనిజులా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 25 శాతం టారిఫ్ విధించడంతో ఈ ఏడాది మార్చిలో కొనుగోళ్లు ఆగిపోయాయి. రిలయన్స్ రష్యా వంటి దేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తోంది. దీని నుంచి తయారైన గ్యాసోలిన్ వంటి ఫ్యూయల్స్‌ను అమెరికన్ మార్కెట్‌లో అమ్ముతోంది. గూగుల్, మెటా వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలు అంబానీ డిజిటల్ వెంచర్ జియోలో ఇన్వెస్ట్ చేశాయి.
రిలయన్స్‌కు ఖతార్‌తో కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (క్యూఐఏ), అంబానీ రిటైల్ వెంచర్‌లో సుమారు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అంబానీ, ఆయన భార్య నీతా ఈ ఏడాది జనవరిలో జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి
హాజరయ్యారు.