IND A vs ENG Lions: కోహ్లీ '18' నెంబర్ జెర్సీ ధరించిన ముఖేష్.. బీసీసీఐ‌పై నెటిజన్స్ ఆగ్రహం

IND A vs ENG Lions: కోహ్లీ '18' నెంబర్ జెర్సీ ధరించిన ముఖేష్.. బీసీసీఐ‌పై నెటిజన్స్ ఆగ్రహం

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కోహ్లీ '18' నెంబర్ జెర్సీ వేసుకోవడం చర్చనీయాంశమైంది. కాంటర్బరీలో ఇండియా ఏ,   ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ముఖేష్ 18వ నంబర్ జెర్సీ ధరించి మైదానంలోకి నడుచుకుంటూ వచ్చాడు. ముఖేష్ చేసి పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెండో రోజు ఆటలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ టీమిండియా పేసర్ 18 నెంబర్ జెర్సీ వేసుకోవడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. 

విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, అతని జెర్సీని ఎవరు వేసుకోవడానికి వీలు లేదని బీసీసీఐని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఎమోషనల్ కాగా.. మరికొందరు ఆగ్రహానికి గురయ్యారు. అభిమానులకు జెర్సీ నంబర్ 18 ఒక ఎమోషన్. అది వేరే వారు ధరిస్తే జీర్ణించుకోలేరు. ఈ జెర్సీ కోహ్లీ పోరాట స్ఫూర్తి, దూకుడు మనస్తత్వం, గొప్పతనం, లాంటి లక్షణాలను సూచిస్తుంది. ముఖేష్ 18వ నంబర్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

సుదీర్ఘ ఫార్మాట్ కు విరాట్ చేసిన అపారమైన కృషికి గాను టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18కు రిటైర్ ఇవ్వాలని ఫ్యాన్స్ బీసీసీఐని బీసీసీఐని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్‌ను రిటైర్ చేస్తారా లేదా.. అదేవిధంగా ఇతర ఆటగాళ్లు టెస్ట్‌లలో 18 జెర్సీని ధరించడానికి అనుమతిస్తారా అనే దానిపై బీసీసీఐ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే భారత క్రికెట్ కు చేసిన కృషికి నివాళిగా బీసీసీఐ గతంలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని జెర్సీ నంబర్లు 10, 7 లను రిటైర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో ముఖేష్ 9 ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 48 పరుగులు ఇచ్చాడు.