ముక్తార్​ అన్సారీ దేశద్రోహి: రాజాసింగ్

ముక్తార్​ అన్సారీ దేశద్రోహి: రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు :  ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్​ రాజకీయ నేత, గ్యాంగ్​స్టర్ ముక్తార్ అన్సారీ దేశద్రోహి అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ముక్తార్ అన్సారీ కుటుంబాన్ని ఓదార్చడానికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెళ్లడంపై సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. “ముక్తార్ అన్సారీ ఒక హంతకుడు. 8 మందిని దారుణంగా చంపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పరామర్శించడం అంటే బాధిత కుటుంబాలను కలవాలి కానీ హంతకుడి కుటుంబాన్ని పరామర్శించడమేంటి? ఒవైసీ వెంటనే అన్సారీ బాధిత కుటుంబా లను పరామర్శించి, ఓదార్చాలి” అని రాజాసింగ్ డిమాండ్​ చేశారు.