ఐదుగురు సీఐలపై వేటు .. . ఐజీ రంగనాథ్ ఆదేశాలు జారీ

ఐదుగురు సీఐలపై వేటు .. . ఐజీ రంగనాథ్ ఆదేశాలు జారీ

హైదరాబాద్‌‌, వెలుగు: అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులపై మల్టీజోన్‌‌ 1 ఐజీ రంగనాథ్‌‌ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇద్దరు ఇన్‌‌స్పెక్టర్లను సస్పెండ్ చేశారు. ముగ్గురిని ఐజీ ఆఫీస్‌‌కు అటాచ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రూరల్‌‌ సీఐ ఎన్ వెంకటేశం, ములుగు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌‌లో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీధర్, మెదక్ అర్బన్‌‌, రూరల్ సీఐలు ఎస్. దిలీప్ కుమార్, బి.కేశవులును మల్టీ జోన్1 ఐజీ ఆఫీస్‌‌కు అటాచ్‌‌ చేశారు. అలాగే, భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సీఐ బి రాజేశ్వర్ రావును కూడా ఐజీ ఆఫీస్‌‌కు అటాచ్‌‌ చేశారు.