ములుగు, వెలుగు: గంజాయి రవాణా, పోక్సో కేసుల్లో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ ములుగు కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బొబ్బ సూర్యప్రకాశ్ గంజాయి తరలిస్తూ 2021లో గోవిందరావుపేట మండలం పస్రా పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై అప్పటి సీఐ శంకర్, ఎస్సై కరుణాకర్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
నిందితుడు సూర్య ప్రకాశ్ కు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి సూర్యచంద్రకళ తీర్పునిచ్చారు. అలాగే వెంకటాపూర్ మండలం కొండాపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ ల్యాదల్ల రజినీకాంత్ 2023లో మైనర్ పై అత్యాచారం చేసినందుకు పోక్సో కేసు నమోదైంది. ఈయనకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4,200 జరిమానా విధిస్తూ
తీర్పునిచ్చారు.
