హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ముంబైతో జరుగుతున్న గ్రూప్–డి మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ ఓటమి ముంగిట నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో ఓవర్‌నైట్ స్కోరు 138/2 తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 267 రన్స్‌కే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది.
ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్ సింగ్ (96), హిమతేజ (40) త్వరగానే ఔటవగా.. మిగతా ప్లేయర్లు నిరాశపరిచారు. అనంతరం 293 రన్స్ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు చివరకు 166/7తో నిలిచింది. హిమతేజ (43), రాహుల్ (33), సీవీ మిలింద్ (30 బ్యాటింగ్) కాస్త పోరాడారు. మోహిత్ అవస్తి, ముషీర్ ఖాన్ చెరో మూడు వికెట్లతో దెబ్బకొట్టారు. హైదరాబాద్ ఇంకా 127 రన్స్ వెనుకంజలో ఉంది. ఆటకు ఆదివారం చివరి రోజు.
