
ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ కు ఇప్పటికే మూడు జట్లు అర్హత సాధించాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టాయి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాయి. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు జట్లలో ఒక జట్టు టాప్-4లో స్థానం సంపాదించనుంది. రెండు జట్లకు మరో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు వెళ్ళడానికి అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ముంబై 12 మ్యాచ్ ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ముంబైకి మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. బుధవారం (మే 21) ఢిల్లీ క్యాపిటల్స్ తో.. మే 26 పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లు గెలిస్తే ముంబై ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. పంజాబ్ మీద ఓడిపోయినా ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తే టాప్-4 లో నిలవొచ్చు. రెండు మ్యాచ్ లు ఓడిపోతే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. ఒకవేళ ఢిల్లీపై ఓడిపోతే మాత్రం చివరి మ్యాచ్ లో పంజాబ్ పై తప్పక విజయం విజయం సాధించాలి. అదే సమయంలో ఢిల్లీ తమ చివరి మ్యాచ్ లో పంజాబ్ పై ఖచ్చితంగా ఓడిపోవాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఈ సీజన్ లో 12 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. బుధవారం (మే 21) ముంబైగా ఇండియన్స్ తో మే 24 న పంజాబ్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లు గెలిస్తే ముంబై ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఒకవేళ ముంబై మీద ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ముంబై మీద గెలిచి చివరి మ్యాచ్ లో పంజాబ్ మీద ఓడిపోయినా అవకాశం ఉంటుంది. కాకపోతే ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ పై ఖచ్చితంగా ఓడిపోవాలి.