
చావోరేవో లాంటి మ్యాచ్ లో కోల్ కతానైట్ రైడర్స్ చెత్తగా ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటిల్లోనూ ఫెయిలై ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. సీజన్ ను ఓటమితో ముగించిన నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుప్లే ఆఫ్స్‌కు పంపింది. మరోవైపు అద్భుత ఆటతో అదరగొట్టిన ముంబై ఏకపక్ష విజయంతో లీగ్ దశను టాప్ ప్లేస్ తో ముగించింది. వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై 9వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ముంబైబౌలింగ్ ధాటికి తొలుత కోల్ కతా 20 ఓవర్లలో ఏడువికెట్లకు 133 రన్స్ మాత్రమే చేసింది. క్రిస్ లిన్ (41),రాబిన్ ఊతప్ప (40) రాణించారు. మలింగ (3/35)మూడు, హార్దిక్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు.అనంతరం ముంబై 16.1 ఓవర్లలో ఒకే వికెట్‌కోల్పోయి 134 రన్స్ చేసి గెలిచింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 8 ఫోర్లుతో 55 నాటౌట్ ) అజేయ హాఫ్‌సెంచరీ, సూర్యకుమార్ యా దవ్ (27 బంతుల్లో 5ఫోర్లు , 2 సిక్సర్లతో 46 నాటౌట్ ) రాణించారు. హార్దిక్ మ్యాన్ ఆఫ్ ది మ్ యాచ్‌గా నిలిచాడు.
ముంబై నెమ్మదిగా
స్వల్ప లక్ష్య ఛేదనను నెమ్మదిగా ఆరంభించిన ముంబై ఓపెనర్లు నాలుగో ఓవర్ తో కాస్త ఊపుతెచ్చారు. తొలిమూడు ఓవర్లలో క్రీజులో నిలదొక్కునేందుకు రోహి త్‌తంటాలు పడగా, డికాక్ వేగంగా పరుగులు రాబట్టే యత్నం చేశాడు. రసెల్ వేసిన నాలుగో ఓవర్ లో రోహిత్ ఓ ఫోర్ కొట్టగా, ఆ తర్వాత డికాక్ వరుసగా 6, 6, 4 బా దేశాడు. సందీప్ వేసిన తర్వాతి ఓవర్ లోరోహిత్ మరో బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత నరైన్ ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 46 పరుగులుచేసింది. పవర్ ప్లే తర్వాత బంతిని అందుకున్న ప్రసీద్ కృష్ణ రైడర్స్ కు తొలి బ్రేక్ అందించాడు. ప్రసీద్ వేసినషార్ట్ బాల్ డి కాక్ బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ ఫైన్ దిశగా గాల్లోకి లేవగా కీ పర్ కార్తీక్ సూపర్ డైవ్ తో దాన్ని పట్టుకున్నాడు. అయితే తర్వాతి బంతికే రోహిత్ ఫోర్ కొట్టగా, వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ ఐదో బాల్ కు ఫోర్ కొట్టాడు. తర్వా త వీరిద్దరూ జాగ్రత్తగా ఆడడంతో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్‌నష్టానికి 76 పరుగులు చేసిన ముంబై మ్యాచ్ పై పట్టుబిగించింది. నరైన్ వేసిన 11వ ఓవర్ లో సూర్యకుమార్ , రోహిత్ చెరో బౌండరీ కొట్టడంతో పాటు మొత్తం 12 పరుగులు రాబట్టారు . నరైన్ వేసిన 14వ ఓవర్‌రెండో బంతికి భారీ సిక్స్ కొట్టిన సూర్యకుమార్ జట్టుస్కోరును వంద పరుగులు దాటించాడు. గుర్నీ వేసిన15వ ఓవర్ లో సింగిల్ తీసిన రోహిత్ హాఫ్ సెంచరీపూర్తి చేశాడు. అప్పటికే స్పీడు పెంచిన సూర్యకుమార్‌చకాచకా బౌండరీలు కొడుతూ లక్ష్యాన్ని కరిగించేశాడు. రసెల్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టినసూర్యకుమార్ లాంఛనం పూర్తి చేశాడు.
మలింగ మాయ
ముంబై బౌలర్ల దెబ్బకు నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్ విలవిల్లాడింది. తొలుత హార్దిక్ పాండ్ యా షాకివ్వగా తర్వాత మలింగ చావు దెబ్బకొట్టాడు. చివర్లో బుమ్రాకూడా చెలరేగడంతో తక్కువ స్కోరు కే పరిమితమైంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతాకు మంచి ఆరంభమే లభించింది. శుభ్ మన్ గిల్ (11)నెమ్మదిగా ఆడగా.. క్రిస్ లిన్ దూకుడుగా ఆడాడు.రోహిత్ రివ్యూకు వెళ్లకపోవడంతో ఎదుర్కొన్న తొలిబంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లిన్ నెమ్మదిగా గేర్లు మార్చాడు. మెక్లెన్ గన్ వేసిన మూడోఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన లిన్ .. మలింగ వేసినతర్వాతి ఓవర్ లో 4, 6 కొట్టి స్కోరు బోర్డుకు ఊపుతె-చ్చా డు. రాహుల్ చహర్ బౌలింగ్‌లో రెండు సిక్స్ లు కొట్టడంతో పవర్ ప్లేలో కోల్ కతా 49/0తో నిలిచింది.ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్ వరుస ఓవర్లలో ఓపెనర్లను పె విలియన్ కు పంపి ఆ జట్టు కు షాకిచ్చా డు. మరో ఎండ్ నుంచి క్రునాల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రైడర్స్ స్కోరు వేగం తగ్గింది. ఊతప్ప క్రీజులో ఉన్నా అతనికి సహకారం కరువైంది. 13 ఓవర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (3), డేంజర్ మ్యాన్ ఆండ్రీ రసెల్ (0)ను వరుస బంతుల్లో ఔట్‌చేసిన మలింగ ప్రత్యర్థిని చావుదెబ్బకొట్టాడు. ఈదశలో నితీశ్ రాణా(26)తో కలిసి ఊతప్ప పోరాటం కొనసాగించాడు. బుమ్రా వేసిన 14వ ఓవర్ లో 4,6 కొట్టి ఒత్తిడి తగ్గిం చే యత్నం చేశాడు. ఆపై హార్దిక్ బౌలింగ్‌లో రాణా రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్ కు ఊపుతెచ్చాడు. కానీ, 18వ ఓవర్లో రాణాను ఔట్ చేసినమలింగ రైడర్స్ ను మళ్లీ దెబ్బకొట్టాడు. లాస్ట్ ఓవర్లో ఊతప్ప, రిం కూ సింగ్(4)ను ఔట్ చేసిన బుమ్రా 4రన్స్ మాత్రమే ఇచ్చి నైట్ రైడర్స్ ను కట్టడి చేశాడు.
స్కోర్ బోర్డు
కోల్ కతా: గిల్ (ఎల్బీ ) (బి) హార్దిక్ 9, లిన్ (సి)డికాక్ (బి) హార్దిక్ 41, ఊతప్ప (సి) రోహిత్ (బి)బుమ్రా 40, కార్తీక్ (సి) క్రునాల్ (బి) మలిం గ 3,రసెల్ (సి) డి కాక్ (బి) మలిం గ 0, రాణా (సి) పొలార్డ్ (బి) మలిం గ 26, రిం కూ(సి) హార్దిక్ (బి) బుమ్రా4, నరైన్ (నాటౌట్ ) 0; ఎక్స్ ట్రాలు :10 ;మొత్తం: 20 ఓవర్లలో 133/7
ముంబై: డి కాక్ (సి) కార్తీక్ (బి) ప్రసీద్ 30, రోహిత్(నాటౌట్ ) 55, సూర్యకుమార్ (నాటౌట్ ) 46 ;ఎక్స్ ట్రాలు :3 ;మొత్తం : 16.1 ఓవర్లలో 134/1