RR vs MI: బ్యాటింగ్‌లో దంచి కొట్టిన ముంబై.. భారీ ఛేజింగ్‌లో రాజస్థాన్ కళ్లన్నీ సూర్యవంశీపైనే

RR vs MI: బ్యాటింగ్‌లో దంచి కొట్టిన ముంబై.. భారీ ఛేజింగ్‌లో రాజస్థాన్ కళ్లన్నీ సూర్యవంశీపైనే

జైపూర్ లోని మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రికెల్ టన్ (38 బంతుల్లో 61:7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53:9 ఫోర్లు ) మెరుపులకు తోడు సూర్య కుమార్ యాదవ్(23 బంతుల్లో 48:4 ఫోర్లు, 3 సిక్సులు) హార్దిక్ పాండ్య(23 బంతుల్లో 48: 6 ఫోర్లు, సిక్సర్) దంచి కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ లో తీక్షణ, పరాగ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఓపెనర్లు రికెల్ టన్, రోహిత్ శర్మ  తొలి వికెట్ కు 116 పరుగులు జోడించి భారీ స్కోర్ కు బాటలు వేశారు. తొలి నాలుగు ఓవర్లలో ఆచితూచి ఆడడంతో 27 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే 5, 6 ఓవర్లలో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా రోహిత్, రికెల్ టన్ జోరు కొనసాగించడంతో స్కోర్ ముందుకు వెళ్ళింది. ఈ క్రమంలో 28 బంతుల్లో రోహిత్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నారు. 

Also Read :  మరీ ఇంత ఘోరమైన ఆటా

స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటయ్యాక రాజస్థాన్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. కెప్టెన్ హార్దిక్ పాండయ్య, సూర్య కుమార్ యాదవ్ రాజస్థాన్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. ఒక వైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు వేగంగా పరుగులు చేశారు. మూడో వికెట్ కు వీరిద్దరూ అజేయంగా 94 పరుగులు జోడించారు. దీంతో ముంబై 217 పరుగులు చేయగలిగింది. 10 ఓవర్లలో 99 పరుగులు చేసిన ముంబై.. చివరి 10 ఓవర్లలో 118 పరుగులు రాబట్టింది.