IPL 2026: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ 

IPL 2026: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ 

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రెండవ మ్యాచ్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ పాండ్యా మాట్లాడుతూ.. పిచ్‌పై గతంలో ఎన్నడూ లేనంతగా గడ్డి కనిపిస్తుండటంతో, ఆరంభంలో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉందని భావించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ స్టేడియంలోని ప్రేక్షకుల మద్దతు మాకు అదనపు బలం.. మా జట్టులో రోహిత్, సూర్యకుమార్ యాదవ్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం నా పనిని సులభతరం చేస్తుందని హార్దిక్ పాండ్యా వెల్లడించారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం.. వాంఖడేలో ఇంత గడ్డిని నేను ఎప్పుడూ చూడలేదు.. ముంబై ఒక ఛాంపియన్ జట్టు, కానీ మేము గత రికార్డుల గురించి ఆలోచించకుండా ప్రస్తుత మ్యాచ్‌పైనే దృష్టి పెడుతున్నాం.. గాయాల వల్ల జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం జట్టులో 6 బ్యాటర్లు, 5 బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఇరు జట్లు: 
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, కార్తీక్ త్యాగి, సౌరభ్ దూబే, తేజస్వి దహియా.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యకుమార్ యాదవ్, కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, రాజ్ బావా, అశ్విని కుమార్.