కరోనా బస్సు వచ్చేసింది.. ప్రత్యేకతలివే..

కరోనా బస్సు వచ్చేసింది.. ప్రత్యేకతలివే..

తొలి కరోనా టెస్టింగ్ బస్సును ఆవిష్కరించిన మహారాష్ట్ర
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ లను గుర్తించడానికి భారీ సంఖ్యలో టెస్టింగ్ లను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓ మొబైల్ కరోనా వైరస్ టెస్టింగ్ బస్ ను రూపొందించింది. ఈ బస్ ను మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే, ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ ఆదిత్య ఠాక్రే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (బీఎంసీ) ప్రవీణ్ పర్దేశీ ఆవిష్కరించారు.

బస్సులోనే టెస్టింగ్స్
కరోనా వైరస్ టెస్టింగ్ బస్సును అన్ని ఎక్విప్ మెంట్స్ తో కూడిన టెస్టింగ్ ల్యాబ్ గా తయారు చేశారు. ఈ బస్సులో ఎక్స్– రే ఎగ్జామినేషన్ ఫెసిలిటీని కూడా కల్పించారు. అవసరమైన మిగతా ఎక్విప్ మెంట్స్ ను త్వరలో చేర్చనున్నారు. టెస్టుల నిర్వహణకు బస్సులో ఓ చిన్న చాంబర్ ను ఏర్పాటు చేశారు.

మురికివాడల ఐసోలేషన్ కు స్వాబ్ కలెక్షన్
‘కరోనా టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన తొలి బస్సు ఇదేనని బీఎంసీ అధికారులు చెప్పారు. కరోనా వైరస్ ను గుర్తించడానికి ఓ2 శాట్యురేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్స్ రే సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. హై రిస్క్ ఉన్న మురికివాడలను గుర్తించి ఐసోలేట్ చేయడానికి ఆర్‌‌టీ–పీటీఆర్ స్వాబ్ కలెక్షన్ ఫెసిలిటీని కూడా కరోనా టెస్టింగ్ బస్సులో పెట్టామన్నారు. ఈ బస్సును కృష్ణా డయాగ్రోస్టిక్ సాయంతో ఐఐటీ అలూమ్ని కౌన్సిల్ రూపొందించింది. ఇక నుంచి క్లౌడ్ ట్రాన్స్ ఫామ్, రేడియోలజీ డిపార్ట్ మెంట్ ఎక్స్ పర్ట్స్​హెల్ప్ తో డాక్టర్లకు కరోనా పేషెంట్లను గుర్తించడం సులువవుతుంది. ఇలాంటి మరిన్ని బస్సులను తయారీ చేయడానికి బీఎంసీ ప్లాన్ చేస్తోంది.