400 కేజీల RDX, 14 మంది పాక్ టెర్రరిస్టులు వచ్చారు : ముంబై పోలీసులకు వాట్సాప్ వార్నింగ్స్

400 కేజీల RDX, 14 మంది పాక్ టెర్రరిస్టులు వచ్చారు : ముంబై పోలీసులకు వాట్సాప్ వార్నింగ్స్

మన దేశం ప్రశాంతంగా ఉంటే వీళ్లు నచ్చదేమో వీళ్లకు.. అందుకే ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటారు. 2025, సెప్టెంబర్ 6వ తేదీ ముంబై సిటీలో గణేష్ నిమజ్జనం జరగనుంది. లక్షల గణనాథులు సముద్రం వైపు వెళ్లనున్నారు. ముంబై సిటీ అంతా కోలాహలంగా ఉంటుంది. ఈ గణేష్ శోభాయాత్రను టార్గెట్ చేశామంటూ తీవ్రవాదుల పేరుతో ముంబై పోలీసులకు సమాచారం వచ్చింది. ముంబై సిటీ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ గ్రూపునకు తీవ్రవాదుల పేరుతో వచ్చిన ఈ సమాచారం.. ఇప్పుడు ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. 

ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ కు వచ్చిన సమాచారం ఇలా ఉంది. ముంబై సిటీ అంతా 34 వాహనాలు మోహరించాయి. ఆ వాహనాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయి. 400 కేజీల ఆర్డీఎక్స్ ఉంది.. 14 మంది పాకిస్తాన్ తీవ్రవాదులు ఇప్పటికే ముంబై సిటీలోకి వచ్చారు.. వీళ్లందరూ మానవ బాంబులతో విధ్వంసం చేయబోతున్నారు. ఈ ఆపరేషన్ లష్కర్ ఏ జిహాదీ అనే గ్రూపు చేస్తుంది అంటూ ఆ సమాచారంలో ఉంది. 

►ALSO READ | భారత్ లో మొట్టమొదటి టెస్లా కారు కొన్నది ఇతనే..

సిటీ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ కు వచ్చిన ఈ వార్నింగ్ ను లైట్ తీసుకోవటం లేదు ముంబై సిటీ పోలీసులు. గణేష్ నిమజ్జనం అనేది చాలా చాలా సున్నితమైన అంశం అని.. అందుకే అప్రమత్తం అయినట్లు ప్రకటించారు. వాట్సాప్ కు వచ్చిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపించారు అనే విషయాలను సైబర్ టెక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.. అదే విధంగా యాంటీ టెర్రర్ డిపార్ట్ మెంట్ ను అలర్ట్ చేశామని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 

ముంబై సిటీలో రద్దీగా ఉండే ప్రాంతాలు, గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాలు, రహదారుల్లో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించింది పోలీస్ శాఖ. వాట్సాప్ బెదిరింపులపైనా విచారణ చేస్తున్నామని..అనుమానాస్పదంగా ఏది కనిపించినా.. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కంట పడినా సమాచారం ఇవ్వాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చారు ముంబై పోలీసులు. గణేష్ మండపాల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని.. అప్రమత్తంగా వ్యవహరించాలని మండపాల నిర్వహకులకు సైతం సమాచారం ఇచ్చారు ముంబై పోలీసులు.