Cricket World Cup 2023: బ్లాక్ టికెట్ల విషయంలో జాగ్రత్త.. ఫ్యాన్స్‌ను హెచ్చరించిన ముంబై పోలీసులు

Cricket World Cup 2023: బ్లాక్ టికెట్ల విషయంలో జాగ్రత్త.. ఫ్యాన్స్‌ను హెచ్చరించిన ముంబై పోలీసులు

ప్రపంచ కప్ 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది. ఈ  మ్యాచ్ కు ముందు ముంబై పోలీస్ డిసిపి ప్రవీణ్ ముండే క్రికెట్ అభిమానులను టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ANIతో మాట్లాడిన ప్రవీణ్ ముండే ప్రపంచ కప్ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ గురించి మాట్లాడాడు. బ్లాక్ టికెట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారత్, శ్రీలంక మ్యాచ్ సందర్భంగా నకిలీ టిక్కెట్లను విక్రయించినందుకు కొంతమందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.

టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వెబ్‌సైట్‌ల నుండి మాత్రమే టిక్కెట్‌ కోనుగోలు చేయాలని ఫ్యాన్స్ కు తెలియజేసారు. వన్డే ప్రపంచకప్ 2023 టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులపై ముంబై పోలీసులు ఐపీసీ 420, 511 కింద కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు. ఒక్క టిక్కెట్టును లక్షా ఇరవై వేల రూపాయలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సెక్యూరిటీ ప్రోటోకాల్‌ల కారణంగా అభిమానులను బుధవారం త్వరగా స్టేడియంకు చేరుకోవాలని కోరారు. స్టేడియం లోపల వాటర్ బాటిళ్లు, పవర్ బ్యాంక్‌లు వంటి నిషేధిత వస్తువుల గురించి కూడా ఆయన మాట్లాడారు.

"మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సెక్యూరిటీ ప్రోటోకాల్‌ల కారణంగా అభిమానులను ముందుగానే స్టేడియంను సందర్శించాలని నేను అభ్యర్థిస్తున్నాను. మేము స్టేడియంను ఉదయం 11:30 గంటలకు తెరుస్తాము. బ్యాగులు, పొగాకు ఉత్పత్తులు, నాణేలు, కాగితం, పెన్సిళ్లు, పెన్నులు, పవర్ బ్యాంకులు, స్టేడియం లోపల వాటర్ బాటిళ్లు, అభ్యంతరకర బ్యానర్లు నిషేధించబడ్డాయి. మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు మరియు వాలెట్లను మాత్రమే స్టేడియం లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఉంది".  అని ప్రవీణ్ ముండే తెలిపారు.