కాంగ్రెస్ హయాంలోనే మున్సిపాలిటీలకు నిధులు : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

కాంగ్రెస్ హయాంలోనే మున్సిపాలిటీలకు నిధులు : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
  •     ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల టౌన్, వెలుగు : కాంగ్రెస్ హయాంలోనే మున్సిపాలిటీలకు నిధులు వస్తాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల మున్సిపాలిటీలో రూ.18.70 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గద్వాల టౌన్, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారని తెలిపారు. 

ఈ నిధులతో బీటీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం తదితర పనులు కంప్లీట్ చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, జంబు రామన్ గౌడ్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.