కల్వకుర్తి, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ కోసమే పనిచేస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల, విగ్రహావిష్కరణ కమిటీ చైర్మన్, న్యాయవాది లక్ష్మణ శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
సమాజంలో మార్పు కోసం గద్దర్ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. మావోయిస్టులకు పునరావాసం కల్పించి జనజీవన స్రవంతిలోకి వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్ పాల్గొన్నారు.
