- ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు
- స్రూట్నీ ప్రక్రియను పరిశీలించిన ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల స్రూట్నీ ప్రక్రియ శనివారం నిర్వహించారు. వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు వేసిన నామినేషన్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వాలిడేట్ కాని నామినేషన్లను రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన నామినేషన్లపై అప్పీల్ చేసేందుకు ఆదివారం అవకాశం ఇవ్వగా, 2న వాటిని పరిష్కరిస్తారు.
3వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రాలకు ఛాన్స్ ఉంది. కాగా, పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నారు. ఇదిలాఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఉన్న 260 వార్డులకు స్క్రూటినీ అనంతరం 1,921 నామినేషన్లను ఆమోదించారు. స్ర్కూటినీ అనంతరం ఆఫీసర్లు ఆమోదించిన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డులకు మొత్తంగా 174 మంది 215 నామినేషన్లు దాఖలు చేయగా, అందులో రెండింటిని తిరస్కరించారు. 174 మందికి సంబంధించి 174 నామినేషన్లను ఆమోదించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులకు 231 మంది 291 నామినేషన్లు వేయగా, స్ర్కూటినీ అనంతరం 234 వాలిడేట్ నామినేషన్లను గుర్తించారు. వర్ధన్నపేటలో 12 వార్డులకు 89 మంది 121 నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలిన అనంతరం 89 మందికి చెందిన 89 నామినేషన్లను ఆమోదించారు.
ములుగు జిల్లా ములుగు మున్సిపాలిటీలోని 20 వార్డులకు 199 నామినేషన్లు వేయగా, స్ర్కూటినీ అనంతరం 176 నామినేషన్లను ఆమోదించారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 230 నామినేషన్లు దాఖలవగా, మూడు రిజెక్ట్ అయ్యాయి. 166 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు తేల్చారు.
జనగామ జిల్లా జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డులకు 292 నామినేషన్లు దాఖలు కాగా, స్ర్కూటినీ అనంతరం 186 మంది అభ్యర్థులకు చెందిన 186 నామినేషన్లను ఆమోదించారు.
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు మొదట 114 మంది అభ్యర్థులు181 నామినేషన్లు వేయగా, స్క్రూటినీ అనంతరం 114 వాలిడేట్ నామినేషన్లను ఫైనల్ చేశారు.
మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ మున్సిపాలిటీలో 230 నామినేషన్లు, మరిపెడలో 139, డోర్నకల్ లో 146, కేసముద్రంలో 123, తొర్రూరులో 144 నామినేషన్లు సరిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారి నామినేషన్లను ఆమోదించారు.
స్రూట్నీని ప్రక్రియ పరిశీలన..
జనగామ అర్బన్/ నర్సంపేట: నామినేషన్ల స్రూట్నీనీ ప్రక్రియను ఆఫీసర్లు పరిశీలించారు. జనగామ మున్సిపల్ ఆఫీస్ లో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు కిల్లు శివకుమార్ నాయకుడు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
