- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: పొరపాట్లకు తావివ్వకుండా మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కరీంనగర్ నగరపాలక సంస్థ, హుజూరాబాద్, చొప్పదండి , జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై టీవోటీ, ఆర్‌వో, ఏఆర్‌వోలకు ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హ్యాండ్ బుక్‌ను క్షుణ్ణంగా చదివి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.
ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకమన్నారు. నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
యువతను ప్రోత్సహించడంలో టీజీఐసీ కీలకం
కరీంనగర్– సిరిసిల్ల బైపాస్‌లోని ఐటీ టవర్‌లో ‘ఇన్నోవేషన్ పంచాయత్’ పేరిట నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. యువతలో ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. వాస్తవ ప్రపంచానికి తగినట్లుగా ఉత్పత్తిని తీర్చిదిద్దడం చాలా అవసరమని తెలిపారు. సదస్సుకు కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నుంచి 60కి పైగా ఔత్సాహిక వ్యవస్థాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, టీజీఐసీ సీఈవో మేరాజ్ ఫహీమ్, కమ్యూనికేషన్ మేనేజర్ వాణి, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
