
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్పీడ్ పెంచారు అధికారులు . ఓ వైపు హైడ్రా, మరోవైపు మున్సిపల్,రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన కట్టడాలు,పర్మిషన్ లేకుండా కడుతోన్న నిర్మాణాలును కూల్చివేస్తున్నారు. శంషాబాద్ లో పర్మిషన్ లేకుండా నిర్మించిన ఆరంతస్తుల భవనాన్ని మే 1న కూల్చివేశారు అధికారులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శంషాబాద్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ యాజమాని ఆరు అంతస్తుల భవనం నిర్మించారు. మూడు సార్లు నోటీసులు అందజేసినా పట్టించుకోలేదు. దీంతో ఇవాళ భారీ పోలీసు బందోబస్తు మధ్యన భవనాన్ని కూల్చివేశారు మున్సిపల్ అధికారులు.
Also Read : కోహెడలో ఉద్రిక్తత..పోలీసుల ముందే కత్తులు, కర్రలతో పొట్టుపొట్టు కొట్టుకున్నరు
ఏప్రిల్ 25న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆరంతస్తుల బిల్డింగ్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. స్టిల్ట్ + 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకొని సెల్లార్, గ్రౌండ్+ 6 ఫ్లోర్స్ నిర్మాణం చేపట్టారు అధికారులు. ఈ అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు స్థానికులు. కోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 25న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు అధికారులు.