- మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితా లు రెండేండ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమో ద ముద్ర అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయడమే అజెండాగా పెట్టుకున్న శక్తులకు ఈ ప్రజా తీర్పు ఓ చెంప దెబ్బ అని వ్యాఖ్యానించారు.
ఓ వైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే.. మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చాలన్న తమ ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసి తీరుతామన్నారు. అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా, అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు, ఈ ఎన్నికల్లో విజయం కోసం ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో అహర్నిశలూ కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
