మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి వల్లే రోహిత్ కిడ్నాప్: మున్నూరు రవి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి వల్లే రోహిత్ కిడ్నాప్: మున్నూరు రవి

మహబూబ్ నగర్  జిల్లాలో రోహిత్ రెడ్డి అనే  యువకుడి కిడ్నాప్  కలకలం రేపుతోంది. మార్చి 14న అర్థరాత్రి 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు రోహిత్ రెడ్డిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మున్నూరు రవికి  సపోర్ట్ చేస్తున్నాడనే కారణంతోనే పోలీసులు రోహిత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తున్నారు.  రోహిత్ రెడ్డి హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.


రోహిత్ రెడ్డిని మంత్రి శ్రీనివాస్ గౌడే కిడ్నాప్   చేయించాడని అతని  అనుచరుడు మున్నూరు రవి ఆరోపించారు. జిల్లాలో శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా పని చేసే వారిపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. రోహిత్ రెడ్డిని తీసుకురావాలని  మహబూబ్ నగర్ కు చెందిన పోలీసులు కాల్ చేసినట్లు మున్నూరు రవి  చెప్పారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి వల్ల పోలీసులే రోహిత్ రెడ్డిని  కిడ్నాప్ చేశారని ఆరోపించారు.