మునుగోడు బై పోల్.. సీపీఐ కీలక సమావేశం

మునుగోడు బై పోల్.. సీపీఐ కీలక సమావేశం

మునుగోడులో పోటీ చేయాలా ? ఏదైనా పార్టీకి మద్దతివ్వాలా అనేది సీపీఐ తేల్చుకోలేకపోతోంది. మునుగోడు బైపోల్ కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వామపక్షాలను ఇప్పటికే కోరింది. పోటీ చేయకున్నా.. కొందరు టీఆర్ఎస్ అని.. మరికొందరు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈసారి అభ్యర్థిని నిలబెట్టాలని ఇంకొంతమంది నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో సీపీఐ నేతల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు ముగ్ధుంభవన్ లో 3 గంటలకు సీపీఐ రాష్ట్రదర్శి కార్యవర్గ సమావేశం జరగబోతోంది.

రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ముఖ్యనేతల సమావేశం జరిగింది. రెండు అంశాలపై చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల పాటు సమావేశం జరిగిన అనంతరం.. తీర్మానాన్ని కేంద్ర కమిటీకి పంపించనుంది. అనంతరం మద్దతుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందరితో చర్చించి.. రేపు తుది నిర్ణయం ప్రకటిస్తామని సీపీఐ నేతలు వెల్లడిస్తు్న్నారు. మునుగోడులో 12 సార్లు ఎన్నికలు జరిగితే.. 5 సార్లు సీపీఐ గెలిచింది.