నల్గొండ: పత్తికొనుగొలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో సీపీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతుందని అన్నారు. మద్యం వల్లే నేరాలు జరుగుతున్నయని… రాత్రి ఎనిమిది గంటలకే వైన్ షాపులను మూసివేయాలని… ప్రభుత్వం బెల్టు షాపులను అరికట్టాలని చెప్పారు. మునుగోడు నియోజక వర్గ పరిధిలోని గ్రామాల్లోని వారంతా కలిసి కట్టుగా బెల్టు షాపులను మూసేస్తె… ఆయన తల్లి సుశీలమ్మ పేరున ఉన్న ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షల నజరానా ఇస్తానని చెప్పారు.
