కేసీఆర్ ది నియంతృత్వ పాలన :మురళీధర్ రావు

కేసీఆర్ ది నియంతృత్వ పాలన :మురళీధర్ రావు

తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. గురువారం పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించుకుండా టీఆరెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందన్నారు.

బీజేపీ మాత్రమే టీఆరెస్ కి వ్యతిరేకంగా  పోరాడుతుందని..కేంద్రప్రభుత్వ పథకాలను నిరాకరిస్తూ తెలంగాణలో టీఆరెస్ సర్కార్ ప్రజలకు అందకుండా చేస్తుందని తెలిపారు. బీజేపీలో చేరితే కేసుల విచారణ నుంచి మినహాయింపు ఎమీ ఉండదని..కేవలం ప్రజాసేవ చేయలనుకునేవారు మాత్రమే బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.