ఈఎన్సీ మురళీధర్ రాజీనామా

ఈఎన్సీ మురళీధర్ రాజీనామా
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) పదవికి మురళీధర్ రాజీనామా చేశారు. సెక్రటేరియెట్‌‌లో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు తన రాజీనామా లేఖను గురువారం అందజేశారు. ఆయన స్థానంలో కొత్త ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)ను శుక్రవారం ప్రభుత్వం నియమించనుంది.

 2013 జూన్ 30న ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ఈఎన్సీగా రిటైర్డ్​అయిన మురళీధర్ అప్పటి నుంచి ఎక్స్‌‌టెన్షన్‌‌పై కొనసాగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు సహా పలు కారణాలతో ఆయనను రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఆదేశించారు. ఈ క్రమంలోనే మురళీధర్ తన పదవికి రిజైన్‌‌ చేశారు. ఆయన రాజీనామాతో ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌కు 13 ఏండ్ల తర్వాత కొత్త బాస్ రానున్నారు.