‘ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేనప్పుడు న్యాయ రాజధాని ఎందుకు?’

‘ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేనప్పుడు న్యాయ రాజధాని ఎందుకు?’

సుగాలి ప్రీతి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలులోని కోట్ల కూడలిలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ… విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగిందని, అత్యంత కిరాతకంగా ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేశారన్నారు పవన్. సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కేసులో పురోగతి లేదని అన్నారు. దిశ చట్టం తెచ్చిన రాష్ట్రంలో ప్రీతికి న్యాయం జరగకపోవడం దౌర్భాగ్యమని, నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించారని మండిపడ్డారు. పోలీసులు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని, హత్య, ఆత్యాచారం జరిగిన కేసుల్లో పోలీసుల అలసత్వం మంచిది కాదని చెప్పారు.

కర్నూలు లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ .. అత్యాచారానికి గురైన ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేనప్పుడు న్యాయ రాజధాని ఎందుకు? అని ప్రశ్నించారు. స్కూల్ కు వెళ్లి ఇంటకి రావాల్సిన బిడ్డను అత్యాచారం చేసి చంపేశారని, విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలా అని  పవన్ ప్రశ్నించారు. తప్పు ఎవరుచే సినా ఎంతటివారైనా శిక్ష పడాల్సిందేనని అందకు జనసేన కట్టుబడి ఉందని అన్నారు. సుగాలి ప్రీతి విషయంలో న్యాయం జరగని పక్షంలో నిరాహార దీక్షకు కూడా వెనుకాడమని చెప్పారు. దోషులకు స్థానిక నాయకుల అండదండలు ఉంటే  వెంటనే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని అన్నారు.

murder-case-of-sugali-preity-should-be-handed-over-to-the-cbi-pawan-kalyan